APRSK ALUMNIFOUNDATION

డల్లాస్ కోడీస్ మీట్ : 28-May-2016 (వీడియో అనువాదం పదాలలో): 
===============================================
కిరణ్ రామినేని(1982) రెండవ రోజు మీట్ ను వెల్-కమ్ నోట్ తో ప్రారంభించారు. ఆయన ఇంగ్లీష్ లో మాట్లాడటం మొదలు పెట్టగా, గ్రూప్ మెంబర్స్ అందరూ తెలుగులో మాట్లాడమని సరదాగా కోరారు. తెలుగు టీచర్ డా. హనుమంత రెడ్డి గారు గూడా సమావేశంలో ఉన్నందున తెలుగులోనే మాట్లాడమని ఆట పట్టించారు. అయితే కిరణ్, సంసృత౦ లో మాట్లాడితే పర్లేదా? అని జోక్ చేశారు. తెలుగులో మాట్లాడకపోతే గురువు గారు మార్కులు కట్ చేస్తారని తిరుగు సమాధానం ఇచ్చారు. జ్యోతి వెలిగించి సదస్సును ప్రారంభించవలసినదిగా మొదటి మహిళా విద్యార్థి మీరా(1979- డాటర్ ఆఫ్ ప్రిన్సిపాల్ ఎన్. నారాయణ రెడ్డి) గారిని ఆహ్వానించారు. ఆమె శుభసూచకంగా జ్యోతి వెలిగించగా, ఇతరులు ప్రార్థనా గీతం ఆలపించడానికి ప్రయత్నించారు. "ఓం... సరస్వతీ నమస్తుభ్యం..." , " యాకుందే౦దు తుషార హార ధవళా.." అని గుర్తు చేసుకొని పాడారు. కొంతమంది మధ్యాహ్నం భోజన సమయంలో పాడాలిసిన "ఓం.. సహనావవత్తు..." , రాత్రి స్టడీ హవర్స్ లో పాడే "బ్రహ్మమురార్చిత.. రార్చిత లింగం.." గూడా కలిపి పాడారు. ఫ్లో మిస్సయితే శ్లోకాలు పాడటం కష్టం అని ఎవరో అన్నారు. అలాగే ప్రార్థనా శ్లోకాలు గూడా సిలబస్ లో భాగమని కొంతమంది బట్టీ పట్టేవారంట. 
పరమపదించిన పూర్వ గురువులు రామస్వామి(బయాలజీ), గుణభూషణ నాయుడు(మాథ్స్), పద్మనాభ రెడ్డి, కృష్ణమూర్తి(సోషల్) నిమిత్తం ఒక నిమిషం పాటు నిలబడి మౌనం పాటించారు.
***
పిదప కిరణ్ తన ప్రెజెంటేషన్ "కోడికూత" స్లైడ్ ద్వారా ప్రారంభించారు. డైనింగ్ హాల్ వెనక బ్యాక్-డ్రాప్ లో వికసించిన గుల్-మొహార్ పూలు ఫొటో చూపిస్తూ , వేసవి సెలవుల తర్వాత ప్రారంభమయ్యే స్కూలు దినాలను జ్ఞాపకం చేశాడు. ఈలోపు చందు ప్రేమతో పంపించిన "తొలిమజిలీ" అనే ఎమోషనల్ కవితా మెసేజిని తేజ అమిలినేని(1989) చదివి వినిపించారు. "ప్రొద్దున నుండి ఆడి అలసి ఇంటికి వచ్చిన నాకు- రేయ్ నీవు స్కూల్ కు సెలక్ట్ అయ్యావు- అనే అమ్మ మాట వినిపించింది- ఒకవైపు మంచి స్కూల్ లో చదువుతాడు అని తల్లిదండ్రులు ఆనందం- ఇంకో వైపు ఇల్లు వదిలి వెళ్ళాలనే సంధిగ్దత - జట్కాబండి లో వెళ్ళాను - నన్ను, నా ట్రంకు పెట్టె ను స్కూలులో చేర్పించారు- బోసి రెడ్డి డ్రిల్ క్లాస్‌లో పదిమందితో పాటు పక్కన నిలబెట్టినాడు- తీయటి దెబ్బలు తిన్న తర్వాత గానీ ఎందుకో అర్థం కాలేదు (ముందు వరుసలో ఒకరిని తోసి వెనుక ఉన్న వారిని పడేయడం బోసి రెడ్డి గారి ట్రేడ్-మార్క్ షాట్) - తిమ్మప్ప కొట్టే బెల్ తో రోజు వారి పనులు అనుసంధానించుకొన్నాను - ఇది నా తొలిమజిలీ అనుభవం" . 
తేజా మాట్లాడుతూ, "ఆ రోజుల్లో ప్రతి ఒక్కరికీ దాదాపుగా ఇలాంటి అనుభవమే ఉంటుంది. నిజానికి ఆరోజుల్లో ఎంతో క్రమశిక్షణతో గురువులు మనల్ని పెంచారు. యోగ అప్పట్లోనే ప్రాక్టీస్ చేసేవారం. బి.ఏ. మరియు ఎమ్.ఏ. తరగతులలో చెప్పే కంపారేటివ్ స్టడీస్ ను కె.ఎస్.ఎన్ గారు చరిత్రను 9,10 తరగతులలోనే భోధించేవారు." అని అన్నారు. తెలుగు టీచర్ హనుమంత రెడ్డి గారు గూడా డల్లాస్ మీట్ కు హాజరు అయినారు. సార్ ను గుర్తుచేసుకుంటూ గ్రూప్ లో ఒకరు ఇలా అన్నారు, "సార్ ఎవరినైనా కొట్టాలనుకున్నపుడు చేయి ని క్రిందికి విదిలిస్తూ లూజ్ చేసేవారు, అప్పుడు చాలా గట్టిగా దెబ్బ తగులుతుంది అని వేరే వాళ్ళని ముందుకు తోసేవాళ్ళం". 
హనుమంత రెడ్డి గారు మైక్ తీసుకొని" కొడిగెనహళ్ళి స్కూలు అంటే మట్టిలో మాణిక్యాలను వెలికే తీసే సంస్థ. అప్పుడు అంత జాగ్రత్తగా వ్యవహరించినాము కాబట్టే , ఇప్పుడు మీరు ఉన్నత స్థాయిలో ఉన్నారు( గొంతు గద్గగమైనది). వేమన పద్యం ఇలా చెపుతుంది 'చాకలి కోక లుతక చికాకు పడవెరచి - మైల గుచ్చి లెక్క జేయడు - బుద్ది చెప్పువాడు గుద్దితేనేమయా? - విశ్వధాభిరామ వినుర వేమ', అందుచేత బుద్ది చెప్పు వాడు గద్దిస్తే బాధపడ నవసరంలేదు. ఇంకొక పద్యం చెప్పి ముగిస్తాను, 'చెమట కారునట్లు శ్రమజేసి - దేహంబు గడనజేసి కూడు గడవవలెయు - పరులసొమ్ము తాదింట కారాదు - విశ్వధాభిరామ వినుర వేమ.' కనుక మీరు ఏ స్థాయిలో ఉన్నా ఉన్నతంగా జీవించాలని కోరుకుంటూ, సమయమిచ్చినందుకు వందనములు తెలియ జేస్తున్నాను". కిరణ్ మాట్లాడుతూ " సార్ వాళ్ల అబ్బాయి కిషోర్ ఫోన్ చేసి, 'నాన్నగారు ప్లాన్ ప్రకారం జూన్ లో రావాలనుకున్నారు, అయితే "మీట్" ఉంది కనుక మేలోనే రావడానికి 'ప్రిఫోన్' చేసుకుంటామన్నారు, మీకు ఓ.కే నా?' అని అడిగారు. ఐ సెడ్ యస్-యస్-యస్. తరువాత వివేక్ తో విచారించి హనుమంత రెడ్డి గారిని ఆహ్వానించడం జరిగింది. టీచర్లందరీ తరపున ఆయన మన మధ్య ఉండటం ఎంతో సంతోషకరమైన విషయం." 
మధుసూదన్ రెడ్డి (మాదయ్యా-1985) సార్ మాటలకు స్పందిస్తూ "ఆనాడు స్కూల్ మాకు విలువలు నేర్పించింది, కనుక ఈ రోజు అనేక మంది ఎలైట్ పీపుల్ తో పనిచేయగలుగుతున్నాం. మా క్లయింట్, కొలీగ్స్ అనేకమంది హార్వార్డ్, ప్రఖ్యాత యూనివర్సిటీలో చదివిన వారితో వర్క్ చేయగలుగుతున్నాం. మేము ఎప్పటికైనా గురువులు, సమాజం, స్కూల్ ముందు తల ఎత్తుకొనే జీవిస్తాం అని తెలయజేస్తున్నాను".
రత్నాకర్ (1981) "గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు... అని చెప్పినట్టు గా, అప్పుడు టీచర్లు వారి వారి కుటుంబాలతో ఎంత సమయం గడిపే వారో తెలియదు కానీ, మాకు వారు పూర్తి సమయం కేటాయించే వారు. ఒక్క చదువులోనే కాదు స్పోర్ట్స్, సైన్స్, ఎగ్జిబిషన్, ఎస్సే, ఎలక్యూషన్ ఇలా అన్ని రంగాలలో గూడా మేము నేర్చుకోవడానికి సహాయ పడేవారు."
***
కిరణ్ ప్రెజెంటేషన్ కొనసాగిస్తూ " 2000 సం|| లో ప్రిన్సిపాల్ ఓబయ్య గారు ఉన్నపుడు స్కూలు పరిస్థుతులు గూర్చి విచారించినపుడు చాలా దయనీయమైన స్థితిలో స్కూలు ఉంది. విరిగి పోయిన మంచాలు, కుర్చీలు పాడైపోయిన డైనింగ్ హాల్, టాయిలెట్ ఫెసిలిటీ లేకపోవడం ఇంకా చాలా ఇబ్బందులు ఉన్నాయి. గిరిధర్ పొట్టేపాళెం(1983), శుభకుమార్, నరసింహా రెడ్డి తో ఇవన్నీ మాట్లాడుతున్నపుడు స్కూల్ కొరకు ఏదైనా చేయాలనిపించి అనేక మంది పూర్వ విద్యార్థులతో మాట్లాడటం జరిగింది. తరువాత ఆర్గనేజేషన్ ఏర్పాటు చేశాం. అందరినీ కలిపింది ఏంటంటే, 'నాకు స్కూల్ ఇంత మంచి జీవితం ఇచ్చింది, నేను స్కూల్ కోసం తిరిగి ఏమి ఇవ్వగలను?' ఆ "గ్రాటిట్యూడ్" అనే తీవ్రమైన ఒక భావన( ప్రిన్సిపిల్) ఇలా మనందరినీ కలిపింది. 
ఫాల్ఘుణ్(1978) మొదటి ప్రాజెక్ట్ చాలా కేర్-ఫుల్ గా ఎగ్జిక్యూట్ చేశాడు. 
దాదాపు 50000- రూపాయలతో కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు చేశాడు. మొదటి జ్యోతి అలా వెలిగింది, తరువాత మిగిలిన జ్యోతిలన్నీ దగ్గరకు వచ్చి చేరాయి. అప్పటినుండి కయప(1977) "ఆలుమ్ని" ఏర్పాటులో చురుకైన పాత్ర పోషించారు. నందకుమార్,సాంబ(1978) మెడికల్ క్యాంప్ కండక్ట్ చేశారు. స్పోర్ట్ ఎక్విప్-మెంట్ ఇచ్చారు. 2005 లో ఒక స్టూడెంట్ ను దత్తత తీసుకోవడం జరిగింది. అలాంటి చిన్న చిన్న ప్రాజెక్ట్
లు అనేకం చేపట్టడం జరిగింది.
ఆ క్రమంలో ఇద్దరు "బుల్-డోజర్స్" జత కలిసారు. 
ఒకరు రామకృష్ణారావు( ఐ.ఏ.ఎస్) , ఇంకొకరు మల్లికార్జునప్ప( వెల్ఫేర్-డిపార్ట్‌మెంట్). వీరి ఆధ్వర్యంలో స్కూల్ చుట్టూ కాంపౌండ్ వాల్, నూతన క్లాస్-రూమ్ సముదాయం నిర్మించడం జరిగింది.
హరీష్ కుమార్ ను బీటెక్ వరకు స్పాన్సర్ చేశాం. ఇదికూడా ఒక గొప్ప విజయం.
2010 లో సురేష్ పెరుగు(1978), సాలమన్(1990), మాధవ రెడ్డి(1987), ఏకా౦బర౦, సుధాకర్, హరి ప్రకాష్ జత కలిసారు. వారందరూ గూడా చాలా ఉత్తేజంగా పని చేశారు. 
అదే క్రమంలో "లా ఆఫ్ ఎన్-ఫోర్స్‌మెంట్" రాజశేఖర్ బాబు(ఐ.పి.ఎస్. 1985) కలిసారు. 
వారు స్కూల్ కొరకు గవర్నమెంట్ తరపున కష్ట పడ్డారు.
కాట్స్, బెంచెస్, డైనింగ్ హాల్, స్టీమ్-కుకింగ్, మస్కిటో-నెట్స్, టాయి-లెట్స్ స్పాన్సర్ చేయడం జరిగింది. సురేష్ పెరుగు(1978), నయీముల్లా, ఆనంద్ దాసరి, మురళి చి౦తా, తేజా అలిమినేని, ఏకా౦బర౦, వసంత్ ఇంకా అనేకమంది డాక్టర్స్ పెద్ద మొత్తంలో విరాళాలు అందజేశారు.
ఇండియాలో కమిటీని కయిపా, శ్రీనివాస రెడ్డి, సుధాకర్, కె.ఆర్.కె, శ్రీనివాసరాజు మానిటర్ చేస్తున్నారు.
ఇంకా ఎంతో మంది సైలేంట్ కంట్రబ్యూటర్స్ ఉన్నారు. అమెరికాలో ఆనంద్ ముసునూరు(1976), గిరిధర్, మల్లిక్, మోహన్ రెడ్డి, ఫాల్ఘున్ కమిటీని వాచ్ చేస్తున్నారు. వాళ్ళందరూ ఎన్నో గంటలు సమయాన్ని వెచ్చించారు. ప్రతి శనివారం గంటలు గంటలు మీటింగ్లో ఉండేవాళ్ళం, అర్ధరాత్రి వరకూ కాల్స్ కొనసాగేవి. ఇప్పుడు కొంత జీల్ తగ్గింది, అయితే ఆ స్పిరిట్ చావలేదు. దానిని కొంచెం స్పీడప్ చేయాలి. ప్రతి ఒక్కరూ మనీనే ఇవ్వాలని కాదు, అయితే ప్రతి ఒక్కరి పార్టీసిపేషన్ కావాలి. ఈ కమిటీలో ప్రతి ఒక్క కార్యక్రమం గూడా అత్యంత ట్రాన్స్‌పరెన్సీగా జరుగుతున్నాయి, ప్రతి దానికి బ్యాంక్ స్టేట్-మెంట్ లు ఉన్నాయి. మిగిలిన బ్యాచ్ లన్నిటినీ ఇందులో పాల్గొని లీడర్స్ గా మారాలని కోరుతున్నాను. మీకు ఎటువంటి గైడ్ లైన్స్ కావాలన్నా ఇవ్వడానికి సిద్దంగా ఉన్నాం. గ్రూప్ డిస్కషన్స్ చేయండి, మీకు ఉత్తమంగా అనిపించిన ఏ కార్యక్రమమైనా ప్రస్తుత విద్యార్థుల కొరకు చేపట్టండి. కె.ఆర్.కె మరియు మహే౦దర్ రెడ్డి రాష్ట్రంలోని కొడిగెనహల్లి, సర్వేల్, నిమ్మకూరు గురుకులాలకు "స్కూల్ ఆఫ్ ఎక్సలెన్సీ" సాధించడానికి ఎంతో కృషి చేశారు.
కమిటీలో కొన్ని ప్రపోజల్స్ పెడుతున్నాను. ఒకటి, ఓటింగ్ జరపడం. రెండు, కొత్త వారిని చేర్చుకోవడం. ముందుకు వచ్చిన ప్రతి వారిని ఇందులోనికి ఆహ్వానిస్తున్నాం. ఈ సందర్భంగా శుభకుమార్ (ప్రొఫెసర్:మిల్వేక్ స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్) పంపించిన మెసేజ్ చదువుతాను " ఇప్పటికే మీరందరూ చాలా ఇచ్చాము అని తల౦చవద్దు, మీరు ఇంకా ఎక్కువగా చెల్లించవలసి ఉన్నారు. భూమి మీద అత్యంత గొప్ప భోధకుడు ముందుగా చెప్పినట్టు, "మీలో మొదటగా ఉండగోరినవాడు, చివరగా నిలబడటం సర్వేంట్ గా పనిచేయడం నేర్చుకోవాలి". తెరవెనుక పనిచేయడం, కనబడకుండా పనిచేయడం, మైక్రో లెవెల్ లో పనిచేయడం నేర్చుకోవాలి. హ్యూమిలిటీ, సర్విట్యూడ్ అలవరుచుకోవాలి. అవి గొప్పవారు అవడానికి సహాయపడుతాయి. సులభమైన పని ఇతరులు ఎవరైనా చేస్తారు, దానిని వారికి అప్పగించండి, మీరు కష్టమైన పనిని చేపట్టండి."
"వెలుగు, వెలిగించు" లోగో తో ఉన్న టీ-షర్ట్స్ దేవానంద్ రూపొందించారు. 
చివరలో "డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ల్యాంప్స్" కార్యక్రమం జరుపుదా౦."
***
రెడ్డి ఎన్. ఊరిమి౦డి(1982) మాట్లాడుతూ " ఇది నిజంగా ఒక అపురూప సంగమం. కిరణ్ ఇంతవరకూ చెప్పింది విని చాలా సంతోషంగా ఉంది. సేవ చేసే కొద్దీ నేర్చుకుంటూనే ఉండాలి. మనం స్కూలుకు ఏమి చేయగలం? ఒక సలహా ఏమిటంటే- మనకు ఒక ఫార్మల్ స్ట్రక్చర్ ఉండాలి. కమ్యూనికేషన్ నిరంతరం జరగాలి. లా-ఫుల్ ఫండ్ రైసింగ్ జరగాలి. కొత్త వారికి అవకాశం ఇవ్వాలి. మన "ఆల్ముని" కి పవర్ ఉండాలి. స్కూల్ రోజులను నేను ఎప్పటికీ మరచి పోలేను. జట్కాబండి-పులిహోరలు-సెకండ్ ట్రిప్పులు - ఇందాక గురువు చెప్పినట్టు తిన్న దెబ్బలు - అవన్నీ గూడా తీపి గురుతులు. నేను పుట్టింది నెల్లూరు. కేశవులు(మాథ్స్) సార్ ఒకసారి చాలా గట్టిగా కొట్టారు, నాకైతే ఏడుపు రాలేదు గానీ విపరీతంగా నవ్వు వస్తూనే ఉంది, ఎందుకంటే, సార్ కొడుతూ " ఏమిరా, కిలో వంకాయలు 45 పైసలు అయితే, ఐదు వంకాయలకు ఎంతవుతుంది అంటే, బేచ్చునా...? బెయ్యోధ్దా...? అని గంట సేపు ఆలోచిస్తున్నావు" అని అన్నాడు. ఆ స్లాంగ్ విని అలా నవ్వుతూనే ఉన్నాను. ప్రపంచంలో ఏ స్కూల్ గూడా ఇలా విద్యార్థులకు అంతగా జ్ఞానాన్ని ఇచ్చిండదేమో అనుకుంటున్నా. ఇప్పుడు గూడా ఎక్కడైనా ఆకును గిల్లాలంటే భయం వేస్తుంది, అంత క్రమశిక్షణ స్కూల్ నేర్పింది. ఈ స్కూల్- కొట్టింది, పెట్టింది ఇదిగో ఈ ర్యాంక్ గూడా తీసుకో అని ఇచ్చింది."
***
హజరతయ్య నాయుడు(1981) మాట్లాడుతూ " ఆయనంత పాలిష్ గా మాట్లాడక పోయినా నా మాటలలో కొన్ని విషయాలు చెప్పాదల్చుకున్నాను. కిరణ్(1982) గూడా నా క్లాస్-మేటే (నీవు రెండు సార్లు ఒకటే క్లాస్ చదివావని చెప్పు అని గ్రూప్‌లో ఎవరో అన్నారు). ఇంకా కర్నూల్ నరసింహా రెడ్డి గూడా ఒకటే క్లాస్. మన కమిటీ ని కొంచెం ఛానెలైజ్ చేయాలి, కొంచెం విజన్ ఉండాలి. ఇప్పుడు స్కూల్ లో ఎన్విరాన్-మెంట్ పాడు చేశారు. దానిని సరి చేయాలసిన అవసరం ఉంది. బుల్లియింగ్ అనేది తగ్గించాలి. టీచర్స్ మరియు స్టూడెంట్స్ మధ్య ఇంకా మంచి వాతావరణం ఏర్పడాలి.
ఆనంద్ ముసునూరు(1976) " మీరందరూ గూడా స్కూల్ కు తిరిగి ఇవ్వడానికి ఇదే మంచి తరుణం. అయితే కొంత ప్రణాళిక ప్రకారం వెళ్ళాలి. అనేక భవనాలు నిర్మించే క్రమంలో తోట(గార్డెన్) ను కోల్పోయాము. ఇప్పుడు కేవలం మర్రి చెట్టు మాత్రమే ఉంది. అందుచేత మన కమిటీకి ఒక స్ట్రక్చర్ ను క్రియేట్ చేయాలని కోరుతున్నాను."
***
ప్రస్తుత ప్రిన్సిపాల్ శ్రీ వాసుదేవ రెడ్డి గారు వీడియో సందేశం లో మాట్లాడుతూ "పూర్వ విద్యార్థుల సహకారంతో ఎన్నో పనులు పూర్తి చేసాము. స్కూల్ ఆఫ్ ఎక్సలెన్సీ సాధించడం నిజానికి ఒక గొప్ప సంఘటన. దేశంలోకెల్లా కొడిగెనహళ్ళి స్కూల్ ను అత్యుత్తమంగా నిలపడానికి 'డల్లాస్ మీట్' తోడ్పడాలని కోరుతున్నాను"
పి. మాధవరెడ్డి (1987) వీడియో సందేశం లో మాట్లాడుతూ "స్కూలు కోసం పనిచేయడానికి నేను ఎల్లప్పుడూ సిద్దంగా ఉంటాను. ఇప్పటికే నేను అనేక కార్యక్రమాలలో పాల్గొన్నాను. పూర్వ విద్యార్థులు రాజకీయాల్లో ప్రవేశిస్తే సమాజానికి ఎంతో మేలు చేసిన వారు అవుతారు"
***
1981-బ్యాచ్ పరిచయం:
రత్నాకర్ గారు వారి బ్యాచ్ తరపున వందనాలు తెలియజేశారు.
ఆయన యు.స్. - ఇండియా మధ్య బిజినెస్ నిమిత్తం తరచుగా 
తిరుగుతూ ఉంటారు కనుక తాను చేయగలిగిన పనులు స్కూల్ కొరకు చేయడానికి ఆసక్తిని వ్యక్తం చేశారు.
మీరా సత్యవతి " నేను మొట్ట మొదటి గర్ల్ స్టూడెంట్ ని.
నాన్నగారు ఎన్. నారాయణ రెడ్డి ప్రిన్సిపాల్. నేను రెండు సంవత్సరాలు మాత్రమే చదివినప్పటికీ స్కూల్ తో నా అనుబంధం చాలా గొప్పది. నాన్న గారికి ట్రాన్స్-ఫర్ రావడంతో తొమ్మిదో తరగతిలో నేను జాయిన్ అయ్యాను. ఈ స్కూల్ "వన్ ఆఫ్ ది బెస్ట్ స్కూల్" అని తెలిసింది. ఆ సంవత్సరం సరిగా మార్కులు రాలేదు. అయితే పదవ తరగతి లో చాలా కష్టపడి చదివాను. 400+ వచ్చాయి. అప్పట్లో అవి చాలా మంచి మార్కులే. అయితే నాన్నగారు ఎవ్వరి తో నా గూర్చి మాట్లాడినా 'మా అమ్మాయిది లాస్ట్ ర్యాంక్ అండీ' అని అనేవారు. అంటే మిగిలిన వారందరూ ఇంకా బాగా చదివేవారు."
***
1982-బ్యాచ్ పరిచయం: ఆరుగురు విద్యార్థులు హాజరయినారు. ఓ.ఎస్.ఆర్ మాట్లాడుతూ " ఏ సంస్థ మనుగడకైనా ఈ మూడూ ముఖ్యం. ఒకటి ఆర్గనైజర్స్, రెండు ఫండ్స్, మూడు లీడర్స్. ఈ విధంగా కలవడానికి 1982-బ్యాచ్ యొక్క కృషి ప్రత్యేకంగా కిరణ్ అంకితభావం ప్రశంసించదగినది. 2000 లో టెక్నాలజీ అంతగా అందుబాటులో లేదు. అయినా క్లాస్-మేట్.కామ్ లో వెతుక్కోని కిరణ్, రంగాను కలవడం జరిగింది. ఇంకా ప్రవీణ్ యాదవ్, రమేష్ రెడ్డి, రెడ్డి ప్రసాద్, జిలానీ, బెనర్జీ, సి.హెచ్. మోహన్ రెడ్డి ని కలవడం జరిగింది. అప్పట్లో బటన్ ఫోన్స్ మాత్రమే ఉండేవి, ఒక్కో నంబర్ నొక్కుతూ గంటల తరబడి కిరణ్ మా అందరితో మాట్లాడేవాడు. మన కమిటీ ఇంకా విజన్ తో ముందుకు వెళ్ళాలని కోరుతున్నాను"
***
1983-బ్యాచ్ పరిచయం: ముగ్గురు విద్యార్థులు హాజరయినారు. మల్లికార్జున గొల్లి మాట్లాడుతూ "మనం చాలా పనులు చేశాం. గిరిధర్ పొట్టేపాళెం పరిచయం అయినారు. మాది స్ట్రయిక్ బ్యాచ్ గా బాగా పాపులర్. విష్ యు ఆల్ ది బెస్ట్". బెనర్జీ మాట్లాడుతూ" ఇలా అనేక మంది తో కలవడం చాలా సంతోషం. స్కూల్ లో న్యూట్రిషన్ డెఫిషీన్సీ మీద ఏదైనా ఫండ్ ఏర్పాటు చేయాలని కోరుతున్నాను"
***
1984-బ్యాచ్ పరిచయం: ముగ్గురు విద్యార్థులు హాజరయినారు. కృష్ణమోహన్ (ఎస్.పి.ఎల్) మాట్లాడుతూ" మా ఆలోచనలు ఎప్పుడూ స్కూల్ చుట్టూనే తిరుగుతూనే ఉంటాయి. స్కూల్ కొరకు ఏమైనా చేయడానికి మేము ఎల్లప్పుడూ సిద్దంగా ఉన్నాము. ఇంకా ఎక్కువ మనీ రైజ్ చేయాలసి ఉంది".
***
1985-బ్యాచ్ పరిచయం: మధుసూధన్ మాట్లాడుతూ" మహేష్, రామనాథ్ నా క్లోజ్-ఫ్రెండ్స్. నాగేంద్ర ప్రసాద్ నన్ను వెతుకుతూ మా ఊరు వచ్చాడని తెలిసి ఆశ్చర్యపోయాను. అయితే మా ఇంటి వారు నా ఫోన్ నంబర్ షేర్ చేసుకోవడానికి సందేహించినారు. ఎందుకంటే అమెరికాలో ఉన్నాడు కదా, డబ్బులు ఏమైనా ఆశించి ఫోన్ నంబర్ అడుగుతున్నారేమో అని అనుకున్నారు. 
ఆ తర్వాత అనేకమందిని నా ఫ్రెండ్స్ ను కలవడం జరిగింది. ఆనాటి జ్ఞాపకాలు ఎంతో మధురం. హనుమంత రెడ్డి గారు "హౌస్ మాష్టార్" గా ఉన్నపుడు అందరికీ 6 బిస్కట్ పాకెట్స్ ఇస్తే నాకు మాత్రం 7 పాకెట్స్ ఇచ్చేవారు. ఎందుకంటే నా చేతివ్రాత బాగుండేది. సార్ ఇంట్లో జిలేబి, గుడ్డు తినాలనే లక్ష్యం గూడా నెరవేర్చుకున్నాను. క్రికెట్ చూడాలనుకుంటే తిప్పేస్వామి ఇంటికి వెళ్లేవాళ్ళం."
కృష్ణమోహన్ మాట్లాడుతూ "స్కూల్ వలనే ఈ రోజు మేము స్థాయిలో ఉన్నాం. ఇక్కడ గూడా ఎంతో కష్టపడ్డాం. కొన్ని సంధర్భాలలో డిపార్ట్‌మెంట్ ఆఫ్ లేబర్" తో ఫైట్ చేసాము. మనం తప్పు చేయకపోతే ఎవరికీ భయపడనవసరము లేదు."
రత్నాకర్ రెడ్డి "మన విద్యార్థుల మధ్య ఉన్న సంబంధం రక్త బంధం కంటే గొప్పది. ఇతరులతో కలసి వెంచర్స్, బిజినెస్ చేయడానికి సిద్దంగా ఉన్నాము. ఈ సహవాసాన్ని బట్టి ఎంతో సంతోషిస్తున్నాను."
***
1987-బ్యాచ్ పరిచయం: రామనాథ్ "టీచర్లు నారాయణ రెడ్డి, రామచంద్రా రెడ్డి, బోసిరెడ్డి లను నేను ఎప్పటికీ మరచి పోలేను. వారు మా ముందు పెట్టిన ఎక్స్-పెక్టేషన్స్ చేరుకోవడానికి ఎంతో హెల్ప్ చేసేవారు. ఆవిధమైన ట్రైనింగ్ వలనే ఈరోజు మేము ఈ స్థాయిలో ఉన్నాము."
1989-బ్యాచ్ పరిచయం: తేజ అమిలినేని "మనం ఇంకా ఎన్నో గొప్ప పనులు స్కూల్ కొరకు చేయాలి. 
ఇంకా అనేక పనులు ప్రారంభించాలి"
రాజశేఖర్ "నేను ఎన్నో ఎమోషన్స్ ఇప్పుడు కలిగిఉన్నాను, నాకు చాలా సంతోషంగా ఉంది. స్కూల్ తో నాకు ఉన్న మూడు సంవత్సరాల బంధం, నా జీవితకాలపు అనుబంధంగా మారిపోయింది. స్కూల్ జ్ఞాపకాలు - ఆటోగ్రాఫ్ లు నేను ఎప్పటికీ మరచిపోలేను."
***
1991-బ్యాచ్ పరిచయం: చక్రపాణి, క్రాంతి కిరణ్ రెడ్డి, వెంకటేశ్వర్లు, శ్రీనాథ్, ఆనంద్ దాసరి హాజరయినారు. వెంకీ మాట్లాడుతూ "ఈ కమిటీలలో ఇతర బ్యాచులు గూడా ఇన్వాల్వ్ అవ్వాలి. పది దాటిన వారికి కెరీర్ కౌన్సిలింగ్ ఇప్పించాలి. విద్యార్థులందరు గూడా వెబ్-సైట్లో తమ పేరు నమోదు చేయాలి."
ఆనంద్ దాసరి "స్కూల్ ఫౌండేషన్ లేకుంటే నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉండేవాన్నే కాదు. స్కూల్ తో అనేక అనుభూతులు ఇమిడిఉన్నాయి. ఒక తోటి విద్యార్థి కలిసాడ౦టే సమయం ఎలా గడుస్తుందో తెలీదు. జీవితంలో అనేక అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి. అయితే స్కూల్ వేసిన ఫౌండేషన్ నాకు ఎంతగానో ఉపయోగ పడింది. స్కూల్ కొరకు పనిచేయడానికి నేను ఎల్లప్పుడూ సిద్దంగా ఉన్నాను."
1992-బ్యాచ్ పరిచయం: కిషోర్ హాజరయినారు, తను మాట్లాడుతూ
"నాకు చాలా సంతోషంగా ఉంది, ఇంకా ఇతర బ్యాచులను ఇన్వాల్వ్ చేయాలి, విజన్ మరియు బాధ్యతులను మిగిలిన వారికి పాస్-ఆన్ చేయాలి"

స్కూల్ తో అనుబంధమున్న రామ్ మరియు ప్రియ కొర్రపాటి (హార్వర్డ్ యూనివర్సిటీ) గూడా తమ భావాలు పంచుకున్నారు.

***
ముగింపు:
ఏ.పి.ఆర్.ఎస్.కె ఫౌండేషన్ అనేది స్వచ్ఛంద సంస్థ కనుక ఇక్కడ ఎవరు ఎవరికీ వోట్ ఆఫ్ థాంక్స్ చెప్పవలసిన పనిలేదు అని అన్నారు. ప్రతి ఒక్కరూ గూడా (ఇర్రెస్పేక్టీవ్ ఆఫ్ క్యాడర్) లీడర్ మరియు సర్వేంట్ అని అన్నారు. ప్రతి విద్యార్థికి స్కూల్ తో ఉన్న అనుబంధం రక్త సంబంధం కంటే మించినది అని నినదించారు. స్కూల్ ను ఇంకా ఉన్నత స్థాయిలో నిలపడానికి "ఆలుమ్ని" కట్టుబడి ఉంటుందని ప్రకటించారు. ఒక్క మాటలో చెప్పాలంటే "వెలుగు వెలిగించు" అనే మోటో పూర్వ విద్యార్థులందరూ పాటించాలని తీర్మానించారు.
===============
Disclaimer: అనువాదంలో కొన్ని తప్పులు జరిగే అవకాశం ఉంది. అవి తిరిగి సరి చేయబడుతాయి.
-by 
-Nagaraju Neeuluri (NNR)(1992)

Views: 509

Comment

You need to be a member of APRSK ALUMNIFOUNDATION to add comments!

Join APRSK ALUMNIFOUNDATION

© 2022   Created by APRSK ALUMNIFOUNDATION.   Powered by

Badges  |  Report an Issue  |  Terms of Service