(1) చదువులతల్లి !!!
తేట తెనుగు తియ్యందనాలకాలవాలపు పట్టుకొమ్మ ,
జిలుగు వెలుగుల సొబగును వ్యాప్తిజేసిన పైడిబొమ్మ ,
ఉపనిషన్మధువుల నొలికింపజేసిన పూలరెమ్మ,
తిమిరసంహార జ్ఞానకాంతుల వ్యాప్తిజేసిన దీపపుసెమ్మ,
ముద్దులొలుకు వేనవేల తనయులగన్న వో కూనలమ్మ ...
నశ్వర సౌరభాల వెదజల్లు నవ పల్లవ జాజిమల్లి,
సహస్ర పూర్ణ కుంభముల నొసగే అక్షయ కల్పవల్లి,
సర్వ శాస్త్రాలంకార విద్యాదాయని ఈ పాలవెల్లి,
కోటి “కడిగిన ముత్యాల"ను,"రతనాల"ను తన జడలో తురుముకున్న చదువులతల్లి
నుదుటన అరుణ సిన్దూరమై భాసిల్లిన సుమధుర కోమల అమృతవల్లి ...
మన అందరి ప్రియతమ "కొడిగెనహళ్లి" !!!.
(2) అది నువ్వేనా నేస్తం !!!
ఆనాడు
అందరి ఎదుట ముత్యాల ముగ్గులు తీర్చి
వేన వేల కాంతుల ఆసెల దివ్వెలను వెలిగించి
రాబోయే కాలానికి బంగారు భవితవ్యాల మాలను కూర్చి
వొకరికి వొకరు బాసై పలికిన "వీడ్కోలు" యెదన మరచి
ఎన్నో నక్షత్రాల గుంపులను మూటగా పేర్చి
అంతులేని నిర్లిప్తతను నాకు మిగిల్చి
కనపడని కలల ఆకసంలోకి కొంగ్రొత్త రెక్కలతో ఎగిరిపోయావు !
అది నువ్వేనానేస్తం.. ?
ఈనాడు ...
ఏవో తెలియని దిగంతాల అంచుల నుంచీ
వెలలేని ఆనాటి జ్ఞాపకాల దొంతరలను కదిల్చి
ఆ దివినుండీ ఆనందామృత బిందువులను జాలువార్చి
ఏనాటికీ తీరని నా దాహార్తిని త్రుటిలో తీర్చి
యిదిగో నీకు నేనున్నానంటూ నువ్వు తిరిగి కలిసిన ఈ తరుణంలో
ఏది సత్యమో ఏది అసత్యమో తేల్చుకోలేక
నన్ను నేను నమ్మలేక
వెలుగురేఖలు చూడలేక
మూసుకున్న నా కళ్ళింకా చెమర్చి
ధారాపాతమయి వర్షిస్తూనే వున్నాయి !
లిప్తపాటున నే కళ్ళు తెరచి చూస్తే ఎదురుగా
నాతో నువ్వు..నీతో నేను..!
ప్రియనేస్తం !
వొకరికొకరం అనే ఈ భావమే మన చెలిమిని చేస్తుంది అమరం !
కావాలి మనయీ అస్తిత్వం ...అనంత కోటి ప్రమాణాల కాలాన్ని కొలిచే వొక శాశ్వత కొలమానం...!!!
(3) Brand mark of Kodigenahalli...
నేను..!
సండే ఎప్పుడొస్తుందా అని రోజూ ఎదురు చూసిన నేను
ఆ రోజూ ఏ స్వీటు చేస్తున్నారో అని ముందు రోజు రాత్రినుంచే ఆలోచిస్తూ
అవే కలలు కంటూ...
రామిరెడ్డిని ఎంతో కుతూహలంగా వెయ్యి ప్రశ్నలు అడిగిన నేను
సెకండు ట్రిప్పు వేటలో ఎన్నో వేల సార్లు విజయం సాధించిన నేను
బర్ఫీ కోసం రోడ్డెక్కి దొరికిపోయిన నేను
యింటినుంచీ వచ్చే ఆ లెటర్ల కోసం,ఎం.వో ల కోసం గేటు దగ్గరే
పోస్టుమ్యాన్ ఎప్పుడొస్తాడా అని పడిగాపులు పడ్డ నేను..!
జుట్టు పెరిగినా ఇంకా కటింగు చేయిన్చుకోలేదేమని హౌసుమాస్టారుతో
వీపు విమానం మోత మోగించుకున్న నేను
కిచెను గార్డనులో పని ఎగ్గొట్టి జామకాయల రుచి మరిగిన నేను
సెకండు షోకు వెళ్లి దొరికిపోయి అపాలజీ లెటర్లు రాసిన నేను
అది సరిపోదంటూ తర్వాతిరోజు సరికొత్త బెత్తాలకు వొళ్ళు అప్పగించిన నేను..!
వాటరు రానప్పుడు డైనింగు హాలు బోరింగు దగ్గరా మెయిను ట్యాపు దగ్గరా
క్లాసుమేట్లతోనే హోరాహోరీ తలపడ్డ నేను
ఫ్యాను కింద స్కెచ్చి పెన్ను పెట్టి రకరకాల వృత్తాలను
సృష్టించి రోజూ చూసుకుని మురిసిపోయే అల్ప సంతోషిని నేను..!
న్యూ దార్మేటరీ మీద బయటికి వేళ్ళాడే యినుప కమ్ములకు
రగ్గులు కట్టి దాంట్లో పడుకుని అదేదో సమ్మరు రిసార్టులో
వేసుకున్న గుడారాలలా ఫీలయి ఆదమరచిన నేను
శివరాత్రి పండగరోజు నైటు పెట్టే స్పెషలు గుగ్గుళ్ళు,పుచ్చకాయ కోసం
ఈ పండగ సంవత్సరానికి వొక్కసారే వస్తుంది ఎందుకో అని దిగాలు పడిపోయే నేను..!
చెరుకుగడల కోసం సేవామందిర్ రోడ్ల మీద రన్నింగ్ రేసులెత్తిన నేను
న్యామద్దల క్రికెట్టు టీం మీద ఫైనల్లో గెలిచినప్పుడు ఆకాశానికి ఎగిరి గంతులేసిన నేను
గ్రిగ్సుకు వెళ్లినపుడల్లా జీవిత కాలపు పెట్టుబడినంతా పుల్ల ఐస్ ల మీద పెట్టిన నేను
టెంతు క్లాసులో షేవింగు అంటూ కొత్త బ్లేడుతో ప్రయోగాలు చేసి
మొహమంతా మేకప్పు వేసుకున్న నేను ...!
ఇంకా ఎన్నెన్నో చేసిన నేను..!
ఎన్ని చేసినా...!
ఆనాడూ...
ఈనాడూ...
ఏనాటికీ...
ఈ జగమంతా వ్యాపించి అన్నిటా ముందుండే "కోడి"ని.
అంతటా నేనై నిలచిన సర్వాంతర్వ్యామిని..!
( Here "NENU" represents the typical student of APRSK )
(4)
లేత క్రీము కలరు చొక్కా , ఖాకీ నిక్కరూ..
నిలువలేనంటూ ఊడిపోయిన కొన్ని గుండీలు !
కొన్ని చెప్పులు లేని కాళ్ళు ,కొన్ని సొట్టలు పడ్డ ప్లేట్లు..
క్లాసుల్లో కొన్ని చెయ్యి విరిగిన కుర్చీలు !!
వాటిలో జారగిలపడి స్టడీ అవర్ లో కునుకుపాట్లు పడే కొన్ని తలలు
అయినా సరే...! చదువులో ఎప్పుడూ ముందుండే మెదళ్ళు...!!!
శనివారం రోజు హౌసుమాస్టారు బిస్కెటు ప్యాకెట్టు తెచ్చాడా ఇక చూస్కో...!
ఆ రాత్రంతా నోటికింక సందడే సందడి...!
ఇంటినుంచీ ఊరగాయ తెచ్చుకున్నావా..
రెండు నెలల పాటూ "సహనావవతు" తర్వాత పండగే పండగ ...!
మరి ఆ తర్వాతో..?
రోజూ పక్కకాటు వాడిని దేహీ ! అని అడుక్కోవాల్సిందే..!
అప్పుడప్పుడూ రోడ్డు దాటితే అర్ధ రూపాయికి టైముపాసు బర్ఫీ
బోసిరెడ్డి సారుకి చిక్కిపోయావో దానితో పాటూ బోలెడన్ని తన్నులు కూడా ఫ్రీ..!
ఇంకాస్త బరితెగించి ధైర్యం చేసావా...
వొక్క రూపాయి టిక్కెట్టుతో హిందూపూరులో వెయ్యి వినోదాల సెకండు షో..!
ఆఫ్ కోర్స్..! ఖర్మ కాలి దొరికావో...మీకందరికీ తెలిసిందే ఆ తరువాతి షో ఏంటో...!
టమోటాకు అసలయిన రుచంటూ వచ్చేది
మన వెంకటరామయ్య చేసే చిత్రాన్నం తోటే..
మళ్ళీ జీవితంలో అటువంటిది ఇంతవరకు తినలేదంటే వొట్టు..!
ఇంక రసమంటావా..?
నలుడికీ భీముడికీ కూడా రాదేమో దాన్ని మన రంగారావు లాగా తయారుచెయ్యడం...
నాలుక ఇప్పటికీ ఇంకా దాని రుచి కోసం వెతుక్కుంటూనే వుంది అంటే నమ్మండి...
ఆ...సాయంత్రం పూరీలు అంటే గుర్తు వచ్చేది
మన ఎన్.సి.సి. మాస్టారు క్లాసు ఎప్పుడుందా.. అని..
టెంతు క్లాసు దార్మేటరీ దగ్గర వో మేడి పండు చెట్టు వుండేది గుర్తు వుందా..?
వేమన పద్యం గుర్తొచ్చినప్పుడల్లా ఇప్పటికీ నాకు ఆ చెట్టు పళ్ళే గుర్తుకు వస్తాయి.
కష్టపడి ఆ చెట్టెక్కి పళ్ళు కోసుకుని ప్రతి పురుగూ ఏరి పారవేసి తిన్న ఆ పుణ్య పురుషులము
మనమేనా అని కూడా అనిపిస్తుంది..
నిజంగా చిలకలు జామపళ్ళు కొడతాయో లేదో తెలియదు కానీ,
నన్నడుగు నే చెపుతాను ఎలా కొట్టాలో...
సక్సెస్ ఫుల్ గా సెకండ్ ట్రిప్ కు ఎలా వెళ్ళాలో నన్నడుగు..
ఏకంగా ఒక డాక్టోరల్ థీసిస్ రాసి హార్వర్డ్ యూనివర్సిటీకి సబ్మిట్ చెయ్యగలను.
మన జిమ్నాసియంలో సుంకేసుల చెట్ల కింద కూర్చుని
వాటి పూలతో ఆడుతూ పందేలు ఎలా కట్టాలో అడుగు.
వాటిముందు పల్నాటి యుద్ధాలు ఎందుకు పనికి వస్తాయో
వివరిస్తూ వేల సంపుటాలు వ్రాయగలను.!
నీళ్ళు రాని రోజు బోరింగు దగ్గర గొడవలు గుర్తున్నాయా...?
వాటిముందు వేల కొద్దీ గల్ఫ్ వార్లు బలాదూర్..!
ఎనిమీ అంటే అర్ధం ఏంటని అడిగితే మన కొడిగెనహళ్లి పిల్లలనే అడగాలి.
బిన్ లాడెన్,బుష్ లకు కూడా తెలియదనుకుంటా ఆ పదానికి అర్ధం మన వాళ్ళకి తెలిసినంతగా..!
తల మీద విచిత్ర ప్రయోగాలు ఎలా చెయ్యాలో,
ఇంకా...ఆ డిప్ప కటింగు మిషన్ ను అలుపూ సొలుపూ లేక వరసగా
వంద మంది మీద అయినా నిర్దయగా ఎలా ఉపయోగించాలో,
అదీ కాక వెంట్రుకలను రెండు మిల్లీమీటర్ల వ్యాసార్ధం కన్నాఎక్కువగా ఎందుకు ఉంచ కూడదో..
మన బార్బరును అడిగితే గణిత శాస్త్ర ఫార్ములాలతో సహా నిరూపించి ఖచ్చితంగా చెపుతాడు.
డాప్లరు సౌండు ఎఫెక్టు అంటే ఏమిటో
రెండు మైళ్ళ అవతల వున్న వాళ్ళకైనా దిమ్మ తిరిగేటట్టు
వినపడేలా బెల్లు కొట్టే మన గండు తిమ్మప్పనడిగితే వివరిస్తాడు.
వందలకొద్దీ మాసిన బట్టలు వేసినా
విసుగనేది లేకుండా స్నోవైటు మల్లెపువ్వుల్లా సరికొత్తవిగా మార్చి
వారం వారం ఒక్కటి కూడా లెఖ్ఖ తప్పకుండా తిరిగి తెచ్చి ఇచ్చేప్పుడు
నవ్వే తన చిరునవ్వు వెనక దాగిన ఆ ఆనందోబ్రహ్మ రహస్యమేంటో మన ధోబీనడుగు చెపుతాడు.
నేస్తం...!
ఇలా అన్నిటికీ వివరణ ఇవ్వగలనేమో కానీ ...
తుమ్మెదలన్నీ స్నేహ మాధురీ పుష్పాన్ని విడిచి
కొత్త ఆశల రెక్కలతో మనుగడలో
మకరందాన్ని వెతుక్కుంటూ తమకు తోచిన వైపుకు ఎందుకు ఎగిరిపోతాయని
ఎవరైనా అడిగితే మాత్రం నేను సమాధానం చెప్పలేను..!
కల్లా కపటం తెలియని పసి మనసులు
'వీడ్కోలు' పలికేటపుడు జ్ఞాపకాల చిరు దివ్వెలను పేర్చి వెలిగించి
జీవిత కాలపు ఆ ఎడబాటును వోర్వలేక
అన్నీ మరచి ఆర్తితో ఒకరినొకరు తనివి తీరా హత్తుకుని కార్చే ఆ కన్నీటికి
అర్ధమేమిటని మాత్రం నన్ను నువ్వు అడగకు నేస్తం...!
ఆ ప్రశ్నకు మాత్రం సమాధానం నా దగ్గర లేదు...!!!
కేశవరాజు చంద్రశేఖర్...
..1987
Comment Wall (73 comments)
You need to be a member of APRSK ALUMNIFOUNDATION to add comments!
Join APRSK ALUMNIFOUNDATION
Anna Pls give me a ring from your mobile phone to this 8341066298 G.Nagapeeraiah
Anna how are you..Rahaman no.. 00441246766386 & ...00447837965477
Anna many many happy returns of the day.....G.Nagapeeraiah 1988 batch
Anna Good morning ....Many many happy returns of the day....G.Nagapeeraiah 1988 batch...Rahaman no. 00447837965477
Thank u my dear Chandrasekhar today i contact Murali. So nice of you.
Umakumar.
Hi Brother,
Many many Happy returns of the Day.
Regards,
Guru Prasad Guntipalli,
APRSK-1997
hello brother,
This is Manjunath ur schoolmate studied in 2005 batch.I did my B.Tech(Computer Science) in current year.Now I am in Bangalore.I am in job search.Plz refer me to some companies if u known.And send me ur mailid......
Hope for reply.........
Thanks&Regards,
R.Manjunath,
email:emailtomanjur@gmail.com
pno:+919030421021Long time no news! Whats up dude?
Send me your contact nbr ...
yo chandu:
ela unnavu. ekkada vunnavu..
View All Comments