ప్రియమైన స్నేహితులకు,
ఎన్నో ఏళ్ళతరువాత ఇలా మీ అందరినీ ఈ వెబ్ ద్వారా కలవడం ఎంతో చెప్పలేని ఆనందాన్ని కలిగిస్తూవుంది. ఇన్నాళ్ళు ఒకరి గురించి ఒకరం తెలుసుకోలేకపోయాము.మళ్ళీ ఇన్నాళ్ళకు మనసు విప్పి మాట్లాడుకోవడానికి వీలు కుదిరింది. ముందుగా నా గురించి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను.
1984 లో పదవతరగతి పాస్ అవగానే ఇంటర్ ఆనంతపూర్ సాయిబాబా జూనియర్ కాలేజీ లో చదివాను. ఎంసెట్ లో పెద్ద రేంక్ సంపాదించి కే యస్ ఆర్ యం కాలేజీ లో సివిల్ ఇంజనీరింగ్ లో సీటు సంపాదించుకున్నా వద్దనుకుని కర్నాటక లో Industrial&Productionఇంజనీరింగ్ పూర్తిచేసి ఉద్యోగాల వేట లో పడ్డప్పుడు అనుకోకుండా రీసర్చ్ అండ్ డెవలప్మెంట్ (మిస్సైల్ research & development, Ministry of Defence) లో Contract Engineer గా జాయినవడం జరిగింది. హైదరాబాద్ లో అలా పనిచేస్తూ 1999 లో "భారతదేశము నా మాత్రుభూమి, భారతీయులందరూ నా సోదర సోదరీమణులు" అన్న మన జాతీయ ప్రతిజ్ఞ ను నిజం చేస్తూ ఒక Australian Indian అమ్మాయిని పెళ్ళి చేసుకుని ఇండియా వదలి సిడ్నీ వచ్చి 10 సంవత్సరాలు గడచిపోయాయి.
సిడ్నీ వచ్చాక కొంతకాలం వాలెంటరీ విజ్యువల్ బేసిక్ ప్రోగ్రామర్ గా పనిచేసాను. తరువాత నా ఫీల్డ్ అయిన ప్రొడక్షన్ లో నాకు నచ్చిన పని దొరికితే ఒక 5 సంవత్సరాలు పనిచేసి ఇక ఆ కంపెనీలో యెదుగుదల లేక వున్నపరిస్థితులకి రాజీపడి పనిచెయ్యలేక రిజైన్ చేసి Railways లో కస్టమర్ సర్వీస్ లో జాయిన్ అయ్యాను
2003 లో అబ్బాయి (సాయితేజ) పుట్టాడు. 2006 లో అమ్మాయి (సాత్విక) పుట్టింది (ఫోటో లో నాతోపాటు వున్న పిల్ల మా అమ్మాయే). మా ఆవిడ పేరు వాణి. తను క్వాలిఫయిడ్ అకౌంటెంట్. పిల్లల్ని చూసుకోవడానికి తను ఇంట్లో వుంటోంది.
సిడ్నీ లైఫ్ చాలా బిజీ గా వుంది. ఒకవైపు పిల్లల తొందర మరోవైపు పని వత్తిడిలతో కాలం గడుస్తోంది. బాబు ఇప్పుడు ఇయర్ 2 లో వున్నాడు. పాప వచ్చే సంవత్సరం స్కూల్ కు పోతుంది.
ఇది మరి నాగురించి నేను చెప్పాలనుకున్న సంగతులు.మరి మీగురించి మీకు వీలయితే తప్పక తెలియచేయండి.
వుండనా మరి
మీ
శేషు
1984
Comment
© 2024 Created by APRSK ALUMNIFOUNDATION. Powered by
You need to be a member of APRSK ALUMNIFOUNDATION to add comments!
Join APRSK ALUMNIFOUNDATION